‘జనతా గ్యారేజ్’ జోరు మామూలుగా లేదు. తొలి వారాంతంలోనే రూ.50 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ సినిమా.. చవితి సెలవు తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. మంగళ.. బుధవారాల్లో సైతం సినిమాకు పర్వాలేదనిపించే కలెక్షన్లు వచ్చాయి. మేజర్ డ్రాప్ ఏమీ లేదు.ఈ సినిమా కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెప్లెంబర్ 1 వ తేదీన విడుదలయిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. మోహన్ లాల్, సమంతా రుతుప్రభు, నిత్య మేనన్ ఇతర పాత్రలు పోషించారు.
జనతా గ్యారేజ్ 100 కోట్లు వసూలు చేయడంపై ఆ సినిమా హీరో ఎన్టీఆర్ స్పందించారు. ప్రేక్షకుల స్పందన తనను థ్రిల్ కు గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం థ్రిల్లింగ్ గా ఉంది.. ప్రేక్షకులు ఆదరించారు. వారి మద్దతుతో ఇది ఘనవిజయం సాధించగలిగింది. అంకెలు, వసూళ్ళ మీద నాకంత ఆసక్తి లేదు.. మంచి సినిమాలు చేయాలన్నది నా తపన. గ్యారేజిలో నా రోల్ ఓ డిఫరెంట్ మోడ్ లో ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడం నాకు ముఖ్యం” అన్నాడు ఎన్టీఆర్.
కొరటాల శివ దర్శకత్వంలో 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత వేగంగా వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఇదేనని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోందని వెల్లడించారు.
జనతా గ్యారేజ్ శ్రీమంతుడిని దాటేసింది…
ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో ఆల్రెడీ నాన్-బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న ‘జనతా గ్యారేజ్’.. తొలి వారం కలెక్షన్లలోనూ రికార్డు కొట్టింది. ‘శ్రీమంతుడు’ రూ.57 కోట్లతో తొలి వారం నాన్-బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకోగా.. ‘జనతా గ్యారేజ్’ దాని కంటే రూ.5 కోట్లు ఎక్కువగా.. అంటే రూ.62 కోట్లతో రికార్డు బద్దలు కొట్టింది. ‘శ్రీమంతుడు’ ఫుల్ పాజిటివ్ టాక్ తో ఆ కలెక్షన్లు సాధించగా.. ‘జనతా గ్యారేజ్’ డివైడ్ టాక్ తోనూ దాన్ని దాటేయడం విశేషం.
తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో బాహుబలి తర్వాత స్థానంలో నిలిచినా శ్రీమంతుడు రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఇవేవో కాకి లెక్కలు కాదంటూ స్వయంగా నిర్మాతలే ఒక అధికార పోస్టర్ ను విడుదల చేసారు. అతి తక్కువ సమయంలో 50 కోట్లు క్లబ్ లో చేరిన సినిమాల జాబితాలో జనతా గ్యారేజ్ రెండవ స్థానంలో నిలిచిందని ఒక పోస్టర్ ను విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్.
50 కోట్ల క్లబ్ రికార్డును రెండవ సారి అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి వినాయకచవితి కూడా కలసి రావడంతో టాక్ తో నిమిత్తం లేకుండా తోలి 5 రోజులు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. బాహుబలి రికార్డులు మినహా ఉన్నా శ్రీమంతుడు రికార్డులన్ని మోహన్ లాల్, తారక్ లు వశం చేసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది . అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రం బిగ్గిస్ట్ హిట్ గా, నెంబర్ 1 స్థానాన్ని జనతా గ్యారేజ్ దక్కించుకుంది.