100 మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారు..

214
- Advertisement -

ఓ వైపు సైన్యం ఇటీవల చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ కొత్తదేం కాదని.. తమ ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయని కాంగ్రెస్ సినీయర్ నేత పి.చిదంబరం వెల్లడించగా… మరోవైపు ఎల్వోసీ సమీపంలో పాకిస్థాన్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మాటువేశారని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశారు. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్తో పాటు అజిత్ దోవల్ పాల్గొన్నారు.ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు దోవల్ ఓ నివేదికను మోదీకి సమర్పించినట్టు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి దాడులు చేసే అవకాశం ఉన్నట్లు అందులో పేర్కోన్నారు. భారత సైన్యం దాడి చేసిన ప్రాంతంలోనే మరో 12 ఉగ్ర శిబిరాలు వెలిశాయని దోవల్ మోడీకి తెలిపారు. పాకిస్థాన్ ఆర్మీ ఆ ఉగ్ర‌శిబిరాల‌కు ర‌క్ష‌ణ కల్పిస్తున్నట్లు స‌మాచారం. అందులో ఒక్కో ఉగ్ర శిబిరానికి దాదాపు 40 నుంచి 50 మంది పాక్ జ‌వాన్లు రక్షణగా ఉన్నట్లు ఆయ‌న ప్ర‌ధానికి వివ‌రించారు. కశ్మీర్ లోయలో మళ్లీ హింస రాజేసేందుకు, భారత సైనికులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీకి వివరించారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన తర్వాత కేబినెట్ భద్రత కమిటీ సమావేశంకావడమిది రెండోసారి.

- Advertisement -