ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. రిలీజ్ డేట్‌పై కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ పై క్లారిటీ ఇస్తూ.. మేకర్స్ ఈ సినిమాని డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చాలా గ్రాండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రిస్మస్‌కి విడుదల కాబోతున్నఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అభిమానులు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ప్రభాస్ యొక్క 100 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
హోంబలె ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read:TTD:హంస వాహనంపై శ్రీ మలయప్ప