దాసరి చేతుల మీదుగా ‘100 డిగ్రీ సెల్సియస్‌’ ప్రారంభం

187
- Advertisement -

ఐదుగురు కథానాయికలతో సి.ఎల్‌.మీడియా తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘100 డిగ్రీ సెల్సియస్‌’. మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 10న హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. ‘కోటికొక్కడు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో దర్శకరత్న దాసరి నారాయణరావు చేతులమీదుగా ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోని ప్రముఖ నటులతో రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయ్‌ లక్ష్మీ, నికిషా పటేల్‌, అరుంధతి నాయర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చి డైరెక్టర్‌ మిత్రన్‌కి స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ చిత్రం గురించి సి.ఎల్‌.ఎన్‌. మీడియా అధినేత మాట్లాడుతూ – ”ఉత్కంఠ భరితమైన మానవ సంబంధాలతో స్నేహ బాంధవ్యాలు, ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌, స్త్రీ అబల కాదు సబల, స్త్రీకి ఆదిశక్తి అని చాటి చెప్పే థ్రిల్లర్‌ ఇది. ఐదుగురు హీరోయిన్స్‌, ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. రాయ్‌లక్ష్మి, నికిషా పటేల్‌, అరుంధతి నాయర్‌, 100 మందికి పైగా తమిళ్‌, తెలుగు నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార. వెంకటేష్‌, త్రిష జంటగా తెలుగులో రూపొందిన ‘ఆడవారి మాటలకు అర్థాలె వేరులే’ చిత్రాన్ని ధనుష్‌, నయనతార జంటగా తమిళ్‌లో మిత్రన్‌ ఆర్‌.జవహర్‌ రూపొందించారు. ఈ చిత్రం తమిళ్‌లో చాలా పెద్ద హిట్‌ అయింది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘100 డిగ్రిస్‌ సెల్సియస్‌’ చిత్రం అంతకంటే పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.

- Advertisement -