మిలియన్‌ మార్చ్‌కు పదేళ్లు…కవిత ట్వీట్

247
kavitha
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచింది మిలియన్ మార్చ్‌. హైద‌రాబాద్ న‌డిబొడ్డున నిర్వ‌హించిన మిలియ‌న్ మార్చ్ తెలంగాణ ఉద్య‌మాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 2011 మార్చి 10న ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి.

మిలియన్ మార్చ్ పూర్తయి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తాను మిలియ‌న్ మార్చ్‌లో పాల్గొన్న వీడియోను షేర్ చేస్తూ మిలియ‌న్ మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, వారి స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. త‌మ మాతృభూమి కోసం అంద‌రూ క‌లిసిక‌ట్టుగా నిల‌బ‌డి, చ‌రిత్ర సృష్టించామ‌ని క‌విత తెలిపారు.

- Advertisement -