గబ్బర్‌ సింగ్‌కు పదేళ్లు..!

215
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీష్ శంకర్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికే, ఎప్పటికి ఎవర్‌గ్రీనే.

ఈ సినిమాకు ముందుకువరకు ఐరెన్‌ లెగ్‌గా ముద్రపడిన శృతి హాసన్‌కు గబ్బర్ సింగ్ తర్వాత గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. ఆ తర్వాత శృతి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కింది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, సాహితి, భాస్కరభట్ల రవికుమార్, దేవిశ్రీ ప్రసాద్ రాసిన పాటలు ఆకట్టుకున్నాయి.

దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుందే, పిల్లా నువ్వులేని జీవితం, కెవ్వు కేక , మందుబాబులం మేము వంటి పాటలు జనాలను మెప్పించాయి. ఇక తీన్మార్‌తో నష్టాల పాలైన బండ్ల గణేశ్‌కు గబ్బర్ సింగ్ భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు పవన్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

- Advertisement -