10 నిమిషాలు పరిగెత్తితే..ఎన్ని ప్రయోజనాలో!

46
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవనంలో ఆరోగ్యంపై దృష్టి సారించడం పెద్ద టాస్క్ లా మారింది. ఉదయం లేవగానే హడావిడిగా రెడీ అయి ఆఫీస్ కు పరిగెత్తుతూ ఉంటారు. సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి హడావిడిగా డిన్నర్ చేసి వెంటనే బెడ్డెక్కేస్తుంటారు. ఇలా రోజువారీ జీవితంలో ఆరోగ్యంపై దృష్టి సారించడానికి అరగంట సమయం కూడా కేటాయించలేకపోతుంటారు. ఇలా ఉండడం వల్ల వయసుతో సంబంధం లేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటాము. ఫలితంగా యుక్త వయసులోనే వృద్దప్య ఛాయలు రావడంతో పాటు ఎన్నో రోగాలను కొని తెచ్చుకుంటూ ఉంటాము. అయితే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం అత్యంత కీలకమైనది.. రోజుకు కనీసం ఒక అరగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే వ్యాయామం చేయలేని వారు రోజుకు కనీసం ఒక పది నిముషాలైన పరుగెత్తాలని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఇక చేయడం వల్ల శరీరభాగాలన్నిటిలో కదలిక ఏర్పడి రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. ఇంకా శరీరంపై నియంత్రణ, ఏర్పడేందుకు చురుకుగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మనసుకు హాయినిచ్చే ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుందట. తద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయట. ఇంకా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. రోజుకు కనీసం 10-15 నిముషాలు రన్నింగ్ పై దృష్టి పెడితే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -