రాష్ట్ర హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ….తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురిని, జ్యుడిషియల్ ఆఫీసర్ల నుంచి ఐదుగురిని జడ్జిలుగా నియమించడానికి కొలీజియం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు పనిచేయడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. కొత్తగా నియమితులైన 10 మందితో కలిపి… మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరనుంది.
కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్వీ శ్రావణ్‌కుమార్ ఉన్నారు. న్యాయాధికారుల నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున్ ఉన్నారు.