వర్షం సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు.. ఒక్క నిర్మాతే కాదు స్క్రీన్ ప్లే రచయిత కూడా ఆయనే. ఆ తర్వాత ఆయన వాన సినిమాతో మెగా ఫోన్ పట్టారు. ఆ తర్వాత వర్షం సినిమాకు కథ అందించిన వీరూ పోట్ల కూడా బిందాస్ తో దర్శకుడిగా మారాడు. వర్షం సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి కూడా నా ఆటోగ్రాఫ్ మూవీ తో డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. వర్షం అసోసియేట్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరు.
మున్నా సినిమాతో ఆయన డైరెక్షన్ మొదలు పెట్టారు.ఈ సినిమాకి పనిచేసిన మరో ఇద్దరు అసోసియేట్ డైరెక్టర్లు గౌతమ్ పట్నాయక్ కెరటం సినిమాతో, శ్రావణ్ ప్రియుడు సినిమాతో డైరెక్టర్లుగా మారారు. వర్షం కో డైరెక్టర్ రాంబాబు బావ సినిమాతో దర్శకత్వం మొదలెట్టారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు పనిచేసిన ముగ్గురు కొరియోగ్రాఫర్లు ఆ తరువాత డైరెక్టర్లుగా మారారు. ఆ ముగ్గురు లారెన్స్ ప్రభుదేవా, సుచిత్రా చంద్రబోస్ కావడం విశేషం.
ప్రభుదేవాకు ఎమ్మెస్ రాజు తీసిన నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా మూవీ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆయన నిర్మాతగానే పౌర్ణమి సినిమాను ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. ఆ తరువాత ఆయన బాలీవడ్ లో డైరెక్టర్ గా ఫేమస్ అయ్యారు. ఇక లారెన్స్ నాగార్జున మాస్ మూవీతో.. సుచిత్రాచంద్రబోస్ పల్లకిలో పెళ్లికూతురు మూవీతో మొత్తానికి ‘వర్షం’ సినిమా వెనుక పది మంది డైరెక్టర్లు న్నారన్నమాట.ప్రభాస్ ఈ సినిమా ని ఫస్ట్ ఒప్పుకోలేదు కాని చివరకి ప్రభాస్ ఈ సినిమాని ఒప్పుకొని పూర్తి చేశాడు.