తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. రానున్న 10 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రతి ఏడాది జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి ఆ తర్వాత 15 రోజులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయి. కానీ జులై 13వ తేదీ వచ్చినా కానీ ఇప్పటి వరకు ఆశించినంత వర్షాలు కురవలేదు.
రానున్న 10 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. జులై 15 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు చోటుచేసుకునే అవకాశం ఉందని..ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, మహారాష్ట్ర , గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలు, ములుగు తదితర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది.
Also Read:పెసర మొలకలతో ఆరోగ్యం