TTD:సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు

14
- Advertisement -

ఒంటిమిట్టలో సోమవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు శ్రీ కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ఆదివారం సమర్పించారు. మొత్తం 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.

ఈ తలంబ్రాల కోసం ఆరు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి నాలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, ఏడేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని శ్రీ కళ్యాణ అప్పారావు తెలిపారు.

Also Read:ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -