డాకు మహారాజ్..ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

0
- Advertisement -

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.

మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా రానున్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా ఈ ఈవెంట్‌కు ర‌ద్దు చేసిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది. బుధ‌వారం తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌నలో ప‌లువురు భ‌క్తులు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తిరుమ‌ల ఘ‌ట‌న నేప‌థ్యంలో డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

మ‌న సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లే తిరుప‌తి క్షేత్రంలో అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌రం. మా వేడుక‌ను నిర్వ‌హించుకోవ‌డానికి ఇది స‌రైన త‌రుణం కాదు. భ‌క్తులను, వారి మ‌నోభావాలను గౌర‌విస్తున్నాం. అందుకే డాకు మ‌హారాజ్ ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను ర‌ద్దు చేసుకుంటున్నాం. అంద‌రూ అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాం అని మేక‌ర్స్ తెలిపారు.

Also Read:తిరుపతి ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

- Advertisement -