బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని దేశ సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను అప్పగించాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ సీబీఐ జయహో అంటూ ట్వీట్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో సమన్వయం, సహకారం లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం ఇప్పటికే సిఫారసు చేసింది.
అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా తరపున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, మహారాష్ట్ర తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదిస్తున్నారు. ఇక ఇదే కేసులో బీహార్ రాష్ట్రం తరపున మనిందర్ సింగ్ వాదిస్తున్నారు. సుశాంత్ తండ్రి రాజ్‌పుత్ తరపున సీనియర్ కౌన్సిల్ వికాశ్ సింగ్ వాదిస్తున్నారు.