‘హైపర్‌’ కి వస్తోన్న రెస్పాన్స్‌  చాలా హ్యాపీగా వుంది 

554
- Advertisement -
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’. ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకరలతో ఇంటర్వ్యూ..
హైపర్‌ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది? 
– రెస్పాన్స్‌ చాలా బాగుంది. అన్ని ఏరియాల నుంచి సినిమా సూపర్‌హిట్‌ అనే టాక్‌ వస్తోంది. కమర్షియల్‌గా కూడా చాలా బాగుంది. యూత్‌, మాస్‌ ఆడియన్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఈ చిత్రానికి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్‌ ఈ సినిమాని చూస్తామని పర్టిక్యులర్‌గా అడుతున్నారు. అది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.
సత్యరాజ్‌ క్యారెక్టర్‌ హైలైట్‌ అవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారా? 
– బేసిక్‌గా ఇది తండ్రీకొడుకుల మధ్య వున్న రిలేషన్‌ని బాగా ఎలివేట్‌ చేసిన సినిమా. 30 సంవత్సరాలు నిజాయితీకి మారు పేరుగా వున్న తన తండ్రి మరో 30 రోజుల్లో రిటైర్‌ అవ్వబోతున్నాడు. ఒక నిజాయితీగల ఆఫీసర్‌గానే రిటైర్‌ అవ్వాలన్నది కొడుకు కోరిక. తండ్రీ కొడుకుల రిలేషన్‌ అనేది యూనివర్సల్‌. అందుకే ఈ చిత్రానికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది.
ఈ కథకి ఇంత మంచి అప్లాజ్‌ వస్తుందని ముందే అనుకున్నారా? 
– మొదట మేం కథ అనుకున్నప్పుడే రియలిస్టిక్‌గానే దీన్ని డీల్‌ చేద్దామనుకున్నాం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో ఒక అభిప్రాయం వుంటుంది. ఒక ఆఫీసర్‌ అవినీతికి పాల్పడ్డాడంటే దానికి అనేక కారణాలు వుంటాయి. ఆ మెసేజ్‌ని కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో చూపించాలన్న ప్రయత్నమే ఈ సినిమా. కథలో మంచి బలం వుంది కాబట్టి డెఫినెట్‌గా ఇది ఆడియన్స్‌కి రీచ్‌ అవుతుందన్న నమ్మకం మాకు మొదటి నుంచీ వుంది. మేం అనుకున్నట్టుగానే అందరి నుంచి మంచి అప్లాజ్‌ వస్తోంది.
హైదరాబాద్‌ సిటీలోని థియేటర్స్‌, నైజాంలోని కొన్ని పట్టణాల్లోని థియేటర్స్‌కి వెళ్ళారు కదా! అక్కడ ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా వుంది? 
– చాలా అద్భుతంగా వుంది. యూత్‌, మాస్‌, ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి, డైలాగ్స్‌కి బాగా రెస్పాండ్‌ అవుతున్నారు. అయితే ఇది ఒక మాస్‌ సినిమా అనే టాక్‌ బాగా స్ప్రెడ్‌ అయింది. టైటిల్‌ వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు. కానీ, సినిమా చూసిన వాళ్ళంతా ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చాలా చక్కగా చూపించారు అంటున్నారు. దాంతో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా వస్తున్నారు. ఇప్పుడు దసరా పండగ సీజన్‌ వుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇంకా పెరుగుతారని మా నమ్మకం. టి.వి.లో వస్తున్న ప్రోమోస్‌లో కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్‌నే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాం.
ఓవర్సీస్‌లో ఎలాంటి టాక్‌ వచ్చింది? 
– ముందుగా చెప్పినట్టు ‘హైపర్‌’ అంటే ఒక మాస్‌ సినిమా అనేది బాగా స్ప్రెడ్‌ అయింది. దీంతో ఓవర్సీస్‌లో కొద్దిగా స్లోగా స్టార్ట్‌ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్‌ వున్న సినిమా అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కలెక్షన్స్‌ బాగా పెరిగాయి.
డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది? 
– వాళ్ళంతా చాలా హ్యాపీగా వున్నారు. వర్షాల వల్ల ఒకటి, రెండు షోలు కాస్త తగ్గినా తర్వాత హెవీ క్రౌడ్‌తో రన్‌ అవుతోందని చెప్తున్నారు. ఓవరాల్‌గా డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా వున్నారు.
డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ గురించి చెప్పండి? 
– సినిమా రిలీజ్‌ అయింది, మంచి రిజల్ట్‌ వచ్చింది.. ఇవన్నీ పక్కన పెడితే సినిమా స్టార్ట్‌ అయిన నాలుగు నెలల్లో రిలీజ్‌ చేశాం. జూన్‌ 3న సినిమా స్టార్ట్‌ చేశాం. సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ అయింది. తక్కువ టైమ్‌లో షూటింగ్‌ పూర్తి చేసినా ఎక్కడా హడావిడి పడినట్టు అనిపించదు. ఆ క్రెడిట్‌ అంతా 200 పర్సెంట్‌ డైరెక్టర్‌దే. డైరెక్టర్‌లో క్లారిటీతోపాటు స్పీడ్‌ వుంటుందో అప్పుడు సెట్‌లో హడావిడి అనేది లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఒక సీన్‌ని సాగదీసినట్టు కాకుండా బోలెడన్ని ఇంటర్‌ కట్స్‌ వుంటాయి, యాక్షన్‌ బ్లాక్‌లు వున్నాయి, మంచి లొకేషన్స్‌ వున్నాయి. ఈమధ్యకాలంలో ఇంత స్పాన్‌ వున్న సినిమా ఇంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చెయ్యలేదు. డైరెక్టర్‌కి సపోర్ట్‌గా సమీర్‌రెడ్డిగారు, గౌతంరాజుగారు.. ఇలా అందరూ కరెక్ట్‌గా వుండి చెయ్యడం వల్లే అనుకున్న టైమ్‌లో సినిమాని రిలీజ్‌ చెయ్యగలిగాం.
బౌండెడ్‌ స్క్రిప్ట్‌తోనే షూటింగ్‌కి వెళ్ళారా? 
– హండ్రెడ్‌ పర్సెంట్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌తోనే వెళ్ళాం. సెట్‌కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఇంప్రూవ్‌మెంట్స్‌, కొన్ని డైలాగ్స్‌లో చిన్నపాటి మార్పులు తప్ప అనుకున్న సీన్‌ పక్కాగా తీశాం. మాటల విషయంలో అబ్బూరి రవిగారు బాగా హెల్ప్‌ అయ్యారు. ఈ సినిమా కోసం మరో సినిమా కమిట్‌ అవకుండా ఈ సినిమా కోసమే వర్క్‌ చేశారు.
నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌? 
– నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా 90 పర్సెంట్‌ ఫారిన్‌లో వుంటుంది. రొమాంటిక్‌ కామెడీ మూవీ ఇది. మంచి లవ్‌స్టోరీ. యు.ఎస్‌.లో చెయ్యాలా, యూరప్‌ కంట్రీస్‌లో చెయ్యాలా అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. ప్రస్తుతం లొకేషన్స్‌ చూస్తున్నాం. నవంబర్‌ ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఏప్రిల్‌లో షూటింగ్‌ పూర్తవుతుంది. సమ్మర్‌లో సినిమాని రిలీజ్‌ చెయ్యాలన్నది ప్లాన్‌ అంటూ ఇంటర్వ్యూ ముగించారు 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర.
- Advertisement -