భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ సోము వీర్రాజు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ’ కార్యకర్తల కార్యక్రమం లో ప్రవాస భారతీయులు నిర్వహించిన సోషల్ మీడియా పాత్ర ను , అమెరికా లో కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను , మోడీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడాన్ని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదా కంటే , ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎలా అభివృద్ధి చెందుతుందో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ రకంగా సహకరిస్తుందో తెలియచేస్తూ , స్మార్ట్ సిటీస్ ని ఏ రకంగా అభివృద్ధి పరచవచ్ఛో వివరించారు. దీని కోసం BJP /కేంద్ర ప్రభుత్వం /మోడి అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలని వెల్లడిస్తూ , తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు సహకరించాల్సింది గా విజ్ఞప్తి చేసారు.
అమెరికా పర్యటన లో బాగంగా, సాన్ హౌసియా (కాలిఫోర్నియా ), హౌస్టన్ (టెక్సాస్ ), డిట్రాయిట్ (మిచిగాన్ ) లో పట్టణాలలో కూడా ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) లు జరిగాయి .ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి ఏనుగుల (నేషనల్ ప్రెసిడెంట్ -ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ ), జయేష్ పటేల్ (మాజీ ప్రెసిడెంట్ ), హరీ సేతు (నేషనల్ యూత్ కన్వీనర్ ),విలాస్ రెడ్డి జంబుల (నేషనల్ యూత్ కో-కన్వీనర్ ), హరీ సేతు , దీపు భట్ , రామ్ వేముల , శ్రీకాంత్ తుమ్మల ,పార్తీబన్ , ప్రదీప్ కట్ట , హన్మంత్ , కిషోర్, వంశీ యంజాల తదితరులు పాల్గొన్నారు.