సర్జికల్ దాడుల దర్శకుడు అజిత్ దోవల్

232
ajith doval
ajith doval
- Advertisement -

అజిత్ దోవల్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ద వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్.. ప్రస్తుతం పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక ఆపరేషన్లను చాకచక్యంగా నిర్వహించిన దోవల్.. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అందుకే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరమే దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు నరేంద్ర మోడీ.

 ajitdoval-

అజిత్ దోవల్ ,ఈపేరు వినబడితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి , ఒక బిక్షగాడి రుపంలో పాకిస్తాన్ లో గూఢచర్యం చేశాడు, స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబడితే ఒక రిక్షావాడి వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితి ని మన జవాన్లకు చేరవేశాడు, ఇవి కొన్ని మాత్రమే ఇంకా
దేశం కోసం ఎన్నో ఆపరేషన్ లను నిర్వహించాడు, ధైర్యానికి మారుపేరు దోవల్ , ఒక పని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా నెరవెర్చే దాకా నిదురపోడు, అందుకే ఆయనంటే మోదీ గారితో పాటు దేశ ప్రజలకు ఎంతో ఇష్టం.

 ajitdoval-

జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్ కు ఉగ్రవాద ఏరి వేతను మోదీ అప్పగించారు, దీంతో పాక్‌లో మనకు అనుకూలంగా ఉన్న కొంత మంది ప్రజల సహాయంతో ఉగ్ర కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పని అప్పగించిన వారం రోజుల్లోనే పక్కాప్రణాలికలు రచించి భారత్ దెబ్బ ఎలా వుంటుందో పాకిస్తాన్‌కు రుచి చూపించాడు , ఇలాంటి ఆపరేషన్లను చేపట్టాలంటే అగ్రరాజ్యాలకు సైతం నెలల వ్వవధి పడుతుంది , కాని దోవల్ వారం రోజుల్లోనే పనినీ పూర్తి చేశాడు.

 ajitdoval-

ప్రస్తుతం దోవల్.. ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు. ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలీజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా కూడా ఆయన పని చేశారు.

1988 పంజాబ్‌లోని ఆపరేషన్ బ్లాక్ థండర్ ను సక్సెస్ చేసింది ఈయనే.

… ప్రార్థనామందిరంలో దాగున్న ఉగ్రవాదులతో రిక్షా కార్మికుని వేషంలో మాట్లాడి లొంగిపోయేలా చేశారు.

… ఉత్తరాఖండ్‌ కేడర్ కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి దోవల్‌

… కేరళతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.

… సైలెంట్ గా తన పని తాను చేసుకు పోవడంలో దిట్ట

… పాక్‌ను ఏకాకి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

… పాక్‌లోని భారత దౌత్యకార్యాలయంలో ఏడేళ్లు పనిచేసిన అనుభవం

… పఠాన్‌కోట్‌ దాడుల్లో మిలటరీకి చేదోడువాదోడుగా ఉన్నారు.

… ఇప్పుడు పీవోకేలో భారత దళాల మెరుపుదాడుల వెనక కీలకపాత్ర.

… 1971-99 మధ్య భారత్‌లో జరిగిన 15 విమాన హైజాకింగ్‌ యత్నాలను ఆయన ఆధ్వర్యంలోని భద్రతాదళాలు అడ్డుకొని కుట్రదారుల యత్నాలను భగ్నం చేశాయి.

- Advertisement -