సభకు వచ్చి…మంచాలు ఎత్తుకెళ్లారు

306
- Advertisement -

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దేవరియా జిల్లాలో ఖాట్ సభ పేరుతో వినూత్నంగా ప్రచారసభ నిర్వహించారు. ఈ బహిరంగసభలో కుర్చీలకు బదులుగా 2వేల కొత్త నులక మంచాలు వేయించారు. రాహుల్, కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ కూడా వేదికపై ఏర్పాటు చేసిన మంచాల పైనే కూర్చొన్నారు. రైతులతో ముచ్చటించారు.

rahul

అయితే సభ అయిపోయాక అక్కడికి వచ్చిన రైతులు మంచాలను తీసుకెళ్తూ కనిపించారు. ఈ సభ ద్వారా రాహుల్…మరోసారి ప్రధానిపై విమర్శలు గుప్పించారు.దేశంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం స్పందించడం లేదని విమర్శించారు.మోడీ పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారారని రాహుల్ ఆరోపించారు. అన్నదాతల దగ్గర పంట ఉన్నప్పటి ధరకు, మార్కెట్‌ ధరకు చాలా వ్యత్యాసం ఉంటోందన్నారు.

UP-Rahul meeting

యూపీ ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం రాహుల్‌ గాంధీ దేవరియా నుంచి దిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మహాయాత్రను చేపట్టారు. దాదాపు నెల రోజుల పాటు 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం నియోజకవర్గాలు 403) రాహుల్‌ పర్యటించనున్నారు. అంతేగాక, యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి రైతులతో ముచ్చటించనున్నారు.

Khat_sabha

- Advertisement -