రెండు తలల లేగ దూడ

576
Calf with two faces born at Kentucky farm
Calf with two faces born at Kentucky farm
- Advertisement -

ప్రకృతి చిత్ర విచిత్రాలను మనం అంచనావేయలేం.. అయితే, రెండు తలల జంతువులకు సంబంధించి అనేకమైన మూఢనమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికి కవలలు పుట్టే ప్రక్రియలో చోటు చేసుకునే లోపాల కారణంగా ఇలాంటి జీవులు జన్మిస్తాయని నిపుణులు అంటున్నారు.

వీటిని రెండు తలలు ఉన్న ఒక్క జీవిగా పరిగణిస్తున్నారు. లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఈ విధంగా రెండు తలల జీవులు ఉనికి ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 120 మిలియన్ సంవత్సరాల క్రితం రెండు తలల జీవి శిలాజం గురించిన పలు వివరాలను 2007లో బయాలజీ లెటర్స్ అనే జర్నల్ ప్రచరించటం జరిగింది.
అమెరికాలో ఓ ఆవు దూడ రెండు త‌ల‌ల‌తో పుట్టింది. కెంట‌కీలోని క్యాంప్‌బెల్స్ వ్య‌వ‌సాయ‌క్షేత్రంలో ఈ దూడ ఇటీవ‌ల జ‌న్మించింది. రెండు త‌ల‌ల ఆవు దూడ‌ను చూసి జ‌నం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ అబ్బురాన్ని చూసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. మొద‌ట దూడ‌ను చూసిన దాని ఓన‌ర్ స్టాన్ మెక్ క్యూబెన్ అక్క‌డ రెండు దూడ‌లు ఉన్నాయ‌నుకున్నాడు. కానీ కొద్ది సేప‌టి త‌ర్వాత వాస్త‌వాన్ని గ్ర‌హించ‌గ‌లిగాడు.

Calf with two faces born at Kentucky farm

రెండు త‌ల‌ల‌తో పుట్టిన ఆడ ఆవు దూడ‌కు రెండు ముక్కులు, రెండు నోళ్లు, నాలుగు కండ్లు ఉన్నాయి. అయితే నుదురు మ‌ధ్య భాగంలో ఉన్న రెండు కండ్లు మాత్రం ప‌నిచేయ‌డం లేదు. కానీ దూడ మాత్రం ఈజీగా న‌డుస్తోంది. అటూ ఇటూ తిరిగుతూ ఒక్‌‌సారిగా కూల‌బ‌డుతోంద‌ట‌. జీన్ ముటేష‌న్ (జ‌న్యు ఉత్ప‌రివ‌ర్త‌న‌) కార‌ణంగా ఇలా దూడులు పుడుతుంటాయ‌ని నిపుణులు అంటున్నారు. ఈ దూడ మాత్రం గ‌డ్డిని తింటూ ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు ఓన‌ర్లు తెలిపారు. రెండు త‌ల‌ల దూడకు ల‌క్కీని పేరు పెట్టారు.

- Advertisement -