ప్రజా ఆమోదం పొందేలా ఆధునిక పోలీసు వ్యవస్థను నిర్మించడానికి ముఖ్యంగా నేరాలను నిరోధించడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం, స్వచ్ఛందంగా చట్టాన్ని పాటించేలా ప్రజల్ని చైతన్యపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం మంచి ఫలితాలనే ఇచ్చింది. ప్రజల మన్ననలు పొందింది. అయితే, కొన్నిచోట్ల కొంతమంది అధికారుల దురుసు ప్రవర్తనతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికే మచ్చతెచ్చేలా మారింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తిపై మంచిర్యాల పోలీసులు చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్….ఇదేం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ డీజీపీ అనురాగ్ శర్మకు ట్విట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన డీజీపీ… సదరు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. డీజీపీ ఆదేశాల మేరకు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్… మంచాల ఇన్స్‌పెక్టర్‌పై క్రమశిక్షణలకు ఉపక్రమించారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన డీజీపీకి.. మంత్రి కృతజ్ఞతలు తెలపడం విశేషం.
రెండు రోజుల కిందట ఇండియన్ నేషనల్ ర్యాలీ సంస్థ చేపట్టిన బైక్ ర్యాలీని అనుమతి లేదంటూ గంగాధర్ అడ్డుకుని వారిపై చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి ట్విట్టర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఫ్రెండ్లీ పోలీస్ విధానంపై డీజీపీ అనురాగ్‌శర్మను ప్రశ్నించారు. దీంతో స్పందించిన డీజీపీ…సదరు అధికారిపై వేటు వేశారు.
https://youtu.be/Z3hS9hBCoHI