బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ సీత టీజర్ విడుదల (వీడియో)

718
sita Teaser
- Advertisement -

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా సీత. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ కొట్టాడు దర్శకుడు తేజ. ఈసందర్భంగా తాజాగా విడుదలైన ఈటీజర్ ఆకట్టుకుంటోంది. నువ్వు మ‌ట్టికొట్టుకు పోతావే.. నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి అనే డైలాగ్ తో పాటు ఇంత కంత్రి పిల్లకి ఆ పేరు పెట్టారేమిటా అనుకున్నా.. ప‌క్క‌న శ్రీరాముడున్న సంగ‌తి అర్ధం కాలేదు వంటి సంభాష‌ణ‌లు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

కాజల్ ఈమూవీలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి నటించడం ఇది రెండవసారి. గతంలో విరిద్దరూ కవచం మూవీలో నటించారు. కవచం మూవీ బాక్సాఫిస్ వద్ద బొల్తా కొట్టగా సీత సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరిక్షించుకోబుతున్నారు. ఏప్రిల్ -29 ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.

- Advertisement -