బాలయ్యా… ఇదేందయా?….

564
Hero Balakrishna Car Accident In Banjara Hills
Hero Balakrishna Car Accident In Banjara Hills
- Advertisement -

కారు రోడ్డు మీదనే వెళ్లాలి.. అలా కాకుండా.. అది గాలిలోనో – నీళ్ల మీదనో వెళితే దాన్ని ప్రయాణం కాదు విన్యాసం అంటారు. కారు రోడ్డు మీద కాకుండా డివైడర్‌ మీద వెళితే విన్యాసం సంగతి అటుంచితే అది కాస్త ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది.. అలా ప్రమాదం జరిగినా ఘటనలు కూడా ఉన్నాయి..

సరిగ్గా ఇలాంటిదే జరిగింది.. బంజారాహిల్స్‌ లో..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‑లో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఫార్చునర్ కారు(AP 02 AY 0001) అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరుతో ఆ కారు రిజిష్ట్రేషన్ ఉన్నట్లు గుర్తించారు.

కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది. డ్రైవ‌ర్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రమాదం సమయంలో బాలకృష్ణ కారులో లేకపోవడంతో ఆయన అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అర్థరాత్రి సమయం కావడం వల్ల జనసంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

బాల‌య్య కారు ప్ర‌మాదానికి గురి కావ‌డం ఇది రెండోసారి. ఇటీవలే జరిగిన కారుప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయ‌న హిందూపురంలో ప‌ర్య‌టిస్తుండ‌గా..ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది. అప్పుడు కూడా ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డి..త‌ర్వాత మ‌రో కారులో బెంగ‌ళూరు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే.

గతంలో  ముంబైలో బాలీవుడ్ నటుడు  హిట్ అండ్ రన్ కేసులో అడ్డంగా బుక్కై జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే.. ఇప్పుడు అదే తరహాలో బాలకృష్ణ కారు ప్రమాదానికి గురైంది. క్యాన్సర్ అస్పత్రి పరిసర ప్రాంతాల్లో రోగులు,  ప్రజలు రోడ్డు పక్కన పుట్ పాత్ లపై రాత్రి వేళల్లో నిద్రిస్తుంటారు. ఒక వేళ కారు వారిపైనుంచి దూసుకెళ్లి జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 

- Advertisement -