ప్రణయ్‌ హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు

12
- Advertisement -

ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులకు జీవితఖైదు విధించింది. ఏ2 సుభాష్‌ శర్మకు మరణ శిక్ష విధించింది.

తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్‌ యంత్రాంగం.. విచారణ పూర్తి చేసి..ఎనిమిది మందిని నిందితులుగా 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి.

Also Read:అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్..

- Advertisement -