పార్టీకి, ప్రభుత్వానికి మరింత పేరు తెచ్చేలా పనిచేద్దాం..

715
KTR
- Advertisement -

ఈ రోజు నూతన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. కేటీఆర్‌ను కలసిన పలు జిల్లాల నూతన స్ధానిక సంస్ధల ప్రతినిధులు,నూతనంగా గెలుపొందిన జడ్పీటిసిలు, యంపిటిసిలను టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అభినందించారు. ఈ గెలుపుతో పొంగిపోకుండా ప్రజలతో కలిసి పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాను, మండలాన్ని అదర్శవంతంగా తీర్చిదిద్దేలా ప్రయత్నించాలన్నారు. మరోపైపు టీఆర్ఎస్ పాలన ఫలాలను క్ష్రేత్రస్దాయికి తీసుకుపోవడంలో, పార్టీకి మరింత పేరు సాధించేలా ప్రయత్నించాలని కేటీఆర్‌ కోరారు.

KTR

ఈ రోజు తన నివాసంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జడ్పిటీసి, యంపిటిసి ఎన్నికల విజేతలను కలిసి, అభినందనలు తెలిపారు కేటీఆర్‌. సిరిసిల్లా జిల్లాలో గెలిచిన జడ్పిటీసిలు, మరియు వేముల వాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబులతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ది ప్రణాళికలపైన, చేయాల్సిన కార్యక్రమాలపైన నూతనంగా ఎన్నికయిన ప్రజాప్రతనిధులతో కేటీఆర్‌ చర్చించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్దానికి సంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు మంత్రి ఈటెల రాజేందర్, కేటీఆర్‌ పరస్పరం అభినందలను తెలుపుకున్నారు. అటు సిరిసిల్లాతోపాటు, పూర్వ కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున స్ధానిక సంస్ధల స్ధానాలను టీఆర్‌ఎస్‌ గెలుకున్న నేపథ్యంలో కేటీఆర్‌ను ఈ రోజు మంత్రి ఈటెల కలిశారు.

KTR

ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కేటీఆర్‌ అభినందించారు. వరంగల్ జిల్లా నేతలు కేటీఆర్‌ను కలిశారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అద్వర్యంలో కలిసిన నేతలకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో నిలిచిపోయే మేజార్టీ గెలుపు సాధించిన జిల్లా నాయకత్వం పనితీరుపైన హర్షం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ను కలిసిన వారిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సినియర్ నాయకులున్నారు. అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు కేటీఆర్‌. మంత్రుల క్వార్టర్స్ లోని హోంమంత్రి నివాసానికి పలువురు పార్టీ సినియర్ నేతలతో కలిసి వెళ్లి శుభాకంక్షలు తెలిపారు.

- Advertisement -