పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

576
- Advertisement -

భారత్‌ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ద పరిస్థితులు నెలకొంటుండగా.. మరో వైపు దాయాది పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ 3-1 తేడాతో పాక్ను ఓడించి తుది బెర్తును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్తాన్ పై ఎదురుదాడికి దిగిన భారత్ సానుకూల ఫలితాన్ని రాబట్టింది.
india pak
మ్యాచ్ ప్రథమార్థంలో 2-0 తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచిన భారత్..ఆ తరువాత మరో గోల్ సాధించింది. అయితే మ్యాచ్ చివరి పది నిమిషాల్లో ముగుస్తుందనగా పాకిస్తాన్ ఒక గోల్ సాధించడంతో భారత్ కు 3-1 తో విజయం లభించింది. కాగా, ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించి… ఆ విజయాన్ని వీరజవాన్లకు అంకితమిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేశ్ అన్న విషయం తెలిసిందే..

- Advertisement -