జనతాగ్యారేజ్ హిట్ జూనియర్ ఎన్టీఆర్ లో జోష్ ను పెంచింది. గ్యారేజ్ రిలీజ్ తరువాత గ్యాప్ తీసుకోవాలని అనుకున్నా… నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడు తారక్. ఇకపై తాను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తారక్ భావిస్తున్నాడట. అందుకే వక్కంతం వంశీ తారక్ తో సినిమా చేయ్యాలని భావిస్తున్నా.. తారక్ అయన్ని పక్కన పెట్టేశాడు.మరోవైపు తమిళ దర్శకుడు లింగుస్వామి, పూరి జగన్నాధ్ కూడా ఎన్టీఆర్ కు కథలు వినిపించినట్టు వార్తలు వచ్చాయి. వాటిపై కూడా తారక్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనికి కారణం తారక్ కు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని ఉండడమే.
అందుకోసం జూనియర్ పవన్ తో చర్చలు జరుపుతున్నాడని టాలీవుడ్ టాక్. కాటమరాయుడు తరువాత పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. అలా కాకుండా త్రివిక్రమ్ ను తనకు అప్పగించమని పవన్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడట తారక్. కానీ, పవన్ సినిమా చెయ్యడం కోసం త్రివిక్రమ్ ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు.
అలాంటి త్రివిక్రమ్ తో సినిమా చేయాలనేది తారక్ కోరిక. అందుకే త్రివిక్రమ్ తో కాకుండా.. నేరుగా పవన్ వద్దకే వెళ్లి పంచాయతీ పెట్టాడని సమాచారం. డాలీ సినిమా అయిపోయేలాగో త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ చేస్తానని, పవన్ తో మంతనాలు జరుపుతున్నాడట. మరి పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో, త్రివిక్రమ్ అసలు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.