రోజూ దేశంలో ఎక్కడో ఒకచోట లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కనీసం కన్న వారి నుండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. జార్ఖండ్‌లో ఇలాంటిదే ఓ దారుణం ఆలస్యంగా భయటపడింది. రాంఛీలో ఇద్దరు అక్కచెల్లెళ్లకు కన్న తండ్రే కామ యముడయ్యాడు. దాదాపు 100 సార్లు వారిపై అత్యచారం చేశాడు. ఆ తండ్రి ఓ పోలీసు కూడా.. ఆ దుర్మార్గుడు తన పెద్ద కూతురుని ఆరో తరగతిలో ఉండగానే రేప్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పడు ఆమె వయసు 24. ఆమె ఇపుడు ఎలా ఉందంటే 10 సార్లు పెళ్లి చేసుకున్న అమ్మాయిలా ఉందని జార్ఖండ్ మహిళా కమీషన్ చైర్మన్ మహౌ మాంఝీ వెల్లడించారు. చిన్న కూతురికి కూడా ఇలాంటి టార్చర్ అనుభవించిందని తెలిపారు. ఈ విషయాన్ని భయటకు చెప్తే తిండి పెట్టడం ఆపేస్తానని ఆ దుర్మార్గపు పోలీసు తండ్రి పిల్లల్ని భయపెట్టాడని తెలిపారు.
అయితే ఈ విషయం ఎలాగోలా భయటకు వచ్చినా.. మహిళా కమీషన్ మాత్రం వారికి ఎలాంటి సాయం చేయలేకుండా పోయింది. ఆ అక్కచెల్లెళ్లు కేసు పెట్టడానికి ముందుకురాకపోవడమే దీనికి కారణం. ఇపుడు ఈ విషయం బయటకు వస్తే తమ పరువు ఎక్కడ పోతుందనేది వారి భయం. ఇది ఒక్క ఘటన మాత్రమే. ఇలాంటివి దేశం మొత్తం మీద ఎక్కడో ఒక దగ్గర చోటు చేసుకుంటున్నాయి. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే ఇరుగుపొరుగు వాళ్లు, పరిచయస్తులే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
2015లో లైంగికదాడి బాధితులు చేసిన ఫిర్యాదుల్లో 50 శాతమందికి పైగా నిందితుల్లో ఇరుగుపొరుగువారే ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక గతేడాది నమోదైన మొత్తం లైంగిక దాడి కేసుల్లో 95 శాతం మంది నిందితులు పరిచయస్తులే కావడం విస్తుగొలిపే విషయం.
ఇంట్లో మామ, తండ్రి, ఇతర మగవాళ్ల వేధింపులకు బలైన మహిళలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఓ మహిళా కార్యకర్త చెప్పారు. ఇక యుక్తవయసులో ఉన్న మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలియడం లేదని డీపీఎస్ బొకరా డైరెక్టర్ హేమలతా ఎస్ మోహన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ సహా హిమచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, చండీగఢ్ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచే రక్షణ లేకుండా పోతోంది.