బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ 55 కోట్ల రూపాయలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మొదటి రోజు వసూళ్లతో పఠాన్ అరుదైన రికార్డ్ నెలకొల్పింది. దీంతో నాలుగేళ్ల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో కామ్ బ్యాక్ ఇచ్చాడని షారూఖ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
పఠాన్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా భరే వసూళ్లు రాబట్టింది. రెండవ రోజు 70 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా మరింత రికార్డ్ నెలకొల్పింది.భారతదేశంలో ఇప్పటివరకు ఏ సినిమా రెండవ రోజు రూ.70 కోట్లు వసూలు చేయలేదు. ఆ రికార్డ్ సాదించిన మొదటి చిత్రం పఠాన్. మరి షారూఖ్ ఖాన్ ఈ సినిమాతో ఫైనల్ గా ఎన్ని వసూళ్లు సాధిస్తాడో ? ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో ? చూడాలి.
పఠాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాత్మకంగా మంచి వీకెండ్‌ను నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. ఈ వీకెండ్ మరో పోటీ లేకపోవడంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఏదేమైనా సక్సెస్ రేషియో పరంగా కాస్త వెనక్కి తగ్గిన బాలీవుడ్ ‘దృశ్యం’తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే ఇప్పుడు పఠాన్ తో మరింత ముందుకు వెళ్తుంది.
ఇవి కూడా చదవండి..