పెళ్లి చూపులుతో పంట పండింది

607
Pelli Choopulu box office collection
Pelli Choopulu box office collection
- Advertisement -

ఒక్కోసారి అదృష్టం..సినిమా రెండు ఒకలాంటివే అనిపిస్తాయి. తంతే బూర్లె గంపలో పడేస్తాయి. ఇటీవల కాలంలో 50 , 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ అంటే కేవలం కోటి , రెండు కోట్లు పెట్టిన సినిమాలు మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ బరిలో నెంబర్ వన్ హిట్ సాదించగలుగుతున్నాయి.
పెళ్లి చూపులు అనే చిన్న సినిమా వ్యవహారం ఇలాంటిదే. ఈ సినిమా సంగతి ఇప్పటికే అందరికీ దాదాపు తెలిసిందే. సుమారు్ 80 లక్షలతో తీసిన సినిమా. అసలు సినిమాను సంకల్పించినదే, హీరో విజయ్ తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం హిట్ కావడంతో, మరో మంచి సినిమా పడితే బాగుంటుందని. అందుకే విజయ్ బంధువు విదేశాల నుంచి వచ్చి మరీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి రంగంలోకి దిగారు. మంచి సినిమా చేసారు. అదృష్టం సురేష్ దగ్గుబాటి రూపంలో తోడయింది. పిచ్చ పబ్లిసిటీ వచ్చేసింది. సినిమా కుమ్మేసింది.
ఈ చిత్ర తెలుగు రైట్స్ ను కోటి లోపే కొనుగోలు చేసారు..సినిమా బాగుందని మౌత్ టాక్ రావడం తో ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే దాదాపు 30 కోట్లు వసూళ్లు చేసింది..ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలలోని. ఇక ఆతర్వాత పెళ్లి చూపులు చిత్రం. ఈ చిత్రం రిలీజ్ ముందు వరకు కూడా ఎవరికీ తెలియదు. కనీసం ఇందులో తెలిసిన నటి నటులు కూడా ఎవరు లేరు. కేవలం సినిమా బాగుందని టాక్ రావడం తో మల్టీప్లెక్స్ సినిమా అనుకున్నది కాస్తా.. అన్ని సెంటర్లలోనూ దంచేసింది. చిన్న చిన్న సెంటర్లలోనూ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక ‘ఎ’ సెంటర్లలో అయితే తిరుగులేదు. నాలుగో వారంలో కూడా హౌస్ ఫుల్స్ పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు.

మొత్తం టోటల్ గ్రాస్ 35 కోట్లకు పైగా వచ్చింది. దీని వల్ల లాభాలు పొందినవారు చాలా మందే వున్నారు. వాళ్లంతా బయ్యర్లు. అది కాక నిర్మాతలుగా రాజ్ కందుకూరు, యాష్ రంగినేని నేరుగా చెరో నాలుగు కోట్లు లాభాలు ఆర్జించుకున్నారు. ఇక చివర్లో పార్టనర్ గా చేరిన సురేష్ బాబు దాదాపు నాలుగు కోట్లు తీసుకోగలిగారు. సురేష్ బాబు డిస్ట్రిబ్యూషన్ లో చిన్న వాటా తీసుకున్న నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఒకటో అరో వెనకేసుకోగలిగారు. ఇక ఓవర్ సీస్ బయ్యర్ కు అయితే కాసుల పంటే.
ఈ సినిమా బడ్జెట్ చూస్తే కేవలం రెండు కోట్లు. అది కూడా పబ్లిసిటీతో కలుపుకుంటే. కానీ దానికి వచ్చిన కలెక్షన్స్ దాదాపు 26 కోట్లు.

- Advertisement -