నిధుల సేకరణకు మున్సిపల్ శాఖ కసరత్తు…

713
- Advertisement -

SBI CAPS ప్రతినిధి బృందం ప్రతినిధులతో మున్సిపల్ శాఖా మంత్రి కేటీ రామారావు సమావేశం అయ్యారు. మున్సిపల్ శాఖలో ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సేకరణ మీద చర్చించారు. ఈ ప్రాజెక్టుల నిధుల సేకరణకు ఉన్న అవకాశాలతోపాటు యస్బీఐ లాంటి బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు ఉన్న అవకాశాలను చర్చించారు. ప్రభుత్వానికున్న యప్ ఆర్ బియం పరిధులకు లోబడి ఏ మేరకు నిధుల సేకరణ చేయవచ్చు వంటి అంశాలను యస్బిఐ క్యాప్స్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్కు వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖా ప్రత్యేక కార్యదర్శి యంజీ గోపాల్ తో పాటు CDMA, HMDA కమీషనర్లు, HMR MD, GHMC అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ నగరంలో చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు నిధులు దొరకడం కష్టం ఏమీ కాదన్న బ్యాంకు ప్రతినిధులు ఈ మేరకు జిహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. నగరంలో పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుల కోసం పెట్రోలియం, సీవరేజీ, విద్యుత్ చార్జీల్లో కొంత వాటాను ప్రభుత్వం నుంచి కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. అయితే ఈ విషయంలో మరింత లోతుగా అధ్యాయనం చేయాలని మంత్రి కేటీఆర్‌ బ్యాంకు ప్రతినిధులను కోరారు. హైదరాబాద్‌ నగరంలోని ప్రభుత్వ భూముల అభివృద్ధి ద్వారా, ల్యాండ్‌ మోనటైజేషన్‌ ద్వారా నిధులు సమీకరణకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించాలని మంత్రి బ్యాంకు ప్రతినిధులను కోరారు.

- Advertisement -