నయనతార ని వాడుకుంటున్న మహేష్

613
Nayanatara Joined in MaheshBabu Murugadoss movie
Nayanatara Joined in MaheshBabu Murugadoss movie
- Advertisement -

 టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం లో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ నయనతార నటిస్తుందని వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే .. బ్రహ్మోత్సవం చిత్రం తో భారీ ప్లాప్ చూసిన మహేష్ బాబు , మురుగదాస్ తో చేస్తున్న చిత్రం ఫై భారీగా నమ్మకం పెట్టుకున్నాడు.

Nayanathara in Mahesh's film?
Nayanathara in Mahesh’s film?

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై లో జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ లో నయనతార నటిస్తుందని వార్త , సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ఈ పాత్రకు నయనతార అయితేనే బాగుంటుందని దర్శకుడు మురుగదాస్ ఆమెను ఎంపిక చేసాడని ప్రచారం జరుగుతుంది.

కాకపోతే చిత్ర యూనిట్ నుండి ఈ వార్త ఫై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.

నయననా.. ఛాన్సే లేదు : మురుగదాస్‌

 Nayanatara Joined in MaheshBabu Murugadoss movie
Nayanatara Joined in MaheshBabu Murugadoss movie

అవును.. మహేష్ తో తొలిసారిగా నయనతార రొమాన్స్ చేయనుందని వార్తలొచ్చేశాయి. అసలు ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్లపై రూమర్లు రావడం కొత్తేం కాదుగా.

ఆలియా భట్ – పరిణీతి చోప్రా.. ఇలా చాలామంది పేర్లు ఈ సినిమా రిలేటెడ్ గా వినిపించాయిలే గతంలో. అయితే ఈ విషయంపై స్పందించిన మురుగుదాస్.. అసలు సినిమాలో రకుల్ ప్రీత్ తప్పించి మరో హీరోయిన్ చేయడానికి కూడా ఛాన్సే లేదని చెప్పారు. నయనతారను పెట్టుకునేంత సీన్ లేదని తేల్చేశాడు.

మహేష్‌తో రకుల్‌ ఒక్కతే…

Rakul to romance with Mahesh Babu
Rakul to romance with Mahesh Babu

గతంలో బ్రహ్మోత్సవం సినిమాలో పనిచేయాల్సిన సెక్సీ లేడీ రకుల్ ఇప్పుడు మహేష్ తో ఛాన్సు అనగానే కథ వినకుండానే ఓకె చేసేశానని గతంలోనే చెప్పింది. సో.. ఆమె ఒక్కతే సోలోగా రొమాన్స్ చేస్తుంది మరి. ప్రస్తుతం చెన్నయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్-మురుగుదాస్ సినిమా.. జనవరి వరకు ఏకధాటిగా షూట్ చేసి సినిమాను పూర్తి చేయనున్నారు.

- Advertisement -