ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కవగా వ్యభిచారంలో పట్టుబడడం ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకోస్తుంది..నెలలో ఇద్దరు ముగ్గురైనా ఈ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా బెంగాలీ నటి మధుమిత చక్రవర్తి గోవా లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిందనే వార్త మీడియా లో చక్కర్లు కొడుతుంది.
పేరున్న లేదా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లేదా లేడీ ఆర్టిస్టుల ఫొటోలను మార్పింగ్ చేసి నెట్ లో పెట్టడం ఈ మధ్యకాలంలో కామన్ కార్యక్రమం అయ్యిపోయింది. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఈ మార్ఫింగ్ ఫొటోల బారిన పడ్డారు. ఇప్పుడు ఓ టీవి నటి ఈ విషయమై పోలీసులను ఆశ్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
కావాలనే ఎవరో తన ఫై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. రెండు రోజుల క్రితం ఆమె న్యూడ్ పిక్స్ అంటూ కొన్ని మార్ఫింగ్ ఫొటోస్ హల్చల్ చేసిన సంగతి తెల్సిందే..అయితే ఈ పిక్స్ ఫై మధుమిత పిర్యాదు చేయగా పోలిసులు ఆ ఫోటోలను ఎవరు అప్లోడ్ చేసారో కనుగున్నారు.
ఫొటోలను పోస్ట్ చేసిన వెబ్ పేజీ బంగ్లాదేశ్‑కు చెందినవారిదిగా గుర్తించారు. రెండు వేర్వేరు ఫొటోలు తీసుకుని, మధుమిత ఫొటోలను మార్ఫింగ్ చేశారని పోలీసులు చెప్పారు. ఈ లోపు వ్యభిచారంలో పట్టుబడిందనే వార్త ఆమెకు తలనొప్పిగా మారింది.