నక్సలైట్‌గా హీరో రానా..!

743
rana daggubati
- Advertisement -

బహుబలి చిత్రంలో తన నటనతో అందరి దృష్టిని ఆకర్శించాడు యంగ్ డైనమిక్ హీరో రానా దగ్గుబాటి. ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రానా నటిస్తున్న హాథీ మేరా సాథీ – హౌస్ ఫుల్ 3 ఇప్పటికే చిత్రీకరణలు పూర్తి కావచ్చాయి. వీటి తర్వాత రానా నటించే తదుపరి చిత్రాలపైనా సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రానా ‘హిరణ్యకశిప’ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకి తగినట్టుగా కనిపించడానికి ఆయన అవసరమైన కసరత్తు చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా ‘విరాటపర్వం 1992’ అనే సినిమా చేయనున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమాలో నక్సలైట్‌గా రానా కనిపించనున్నాడని సమాచారం. సమాజం అవినీతిని ప్రశ్నించి ఎదిరించే విప్లవ భావాలు కలిగిన నక్సలైట్ పాత్రలో ఆయన అదరగొట్టనున్నాడని చెబుతున్నారు. రానా సరసన సాయిపల్లవి నటించనున్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో ‘టబు’ కనిపించనుంది. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావల్సివుంది.

- Advertisement -