ధనుష్‌, కీర్తి సురేష్‌ల ‘రైల్‌’ 

599
- Advertisement -
రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్‌ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రైల్‌’. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌ పతాకాలపై బేబి రోహిత రజ్న సమర్పణలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 3న గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
thodari-release-news
ఈ సందర్భంగా నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ – ”హీరో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన రఘువరన్‌ బి.టెక్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ అయింది. అలాగే నేను శైలజ చిత్రంలో హీరోయిన్‌గా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన హీరోయిన్‌. కీర్తి సురేష్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రైల్‌’. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 3న విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్‌ మహేంద్రన్‌, ఎడిటింగ్‌: ఎల్‌.వి.కె.దాస్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌.
- Advertisement -