- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా విజయదశమి సందర్బంగా విడుదలవుతున్న మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సురేందర్‌రెడ్డి, గీతాఆర్ట్స్ ‘ ధృవ’
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ ధృవ’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సెప్టెంబర్ 5 నాటికి టోటల్ టాకీ కంప్లీట్ చేసకుని మిగిలిన సాంగ్స్ ని కూడా అదే నెలలో షూటింగ్ చేసకుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నటనతో పాటు అరవింద్ స్వామి ఫెర్‌ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఓకరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ…. రాంచరణ్ , రకూల్ ప్రీత్ సింగ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ‘ ధృవ’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ధృవ’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశాం. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ కథాంశంతో కూడిన కథ కావడం, దానికి తగ్గట్టుగా రాంచరణ్ తన బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నాడు. ఏమాత్రం డిలే లేకుండా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 నాటికి సాంగ్స్ మినహ టోటల్ టాకీ ఫినిష్ అవుతుంది. మరో పక్క శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడా చిన్న డిలే లేకుండా అనుకున్న విధంగానే అక్టోబర్ 7న విజయదశమి సందర్బంగా విడుదల చేస్తున్నాము . అని అన్నారు.
నటీనటులు
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్
మ్యూజిక్ – హిప్ హాప్ ఆది
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
ఆర్ట్ – నాగేంద్ర
ఎడిటర్ – నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్
ప్రొడ్యూసర్ – అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్
దర్శకుడు – సురేందర్ రెడ్డి
- Advertisement -