తిరుప‌తిలో.. మ‌న‌లో ఒక‌డు

199
MANALO OKADU
MANALO OKADU
- Advertisement -

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ జ‌ర‌గ‌నుంది. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ‘నువ్వు నేను’ ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు.

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ “మా చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం డీటీయ‌స్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నెల 19న తిరుప‌తిలో సంగీత విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హిస్తాం. `మ‌న‌లో ఒక‌డు` మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం“ అని అన్నారు.

నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ “ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. అందుకే 19న తిరుప‌తిలో ఆడియో స‌క్సెస్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఈ నెలాఖ‌రున చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం “ అని చెప్పారు. సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

- Advertisement -