తల్లి కాబోతున్న ఉదయభాను…

296
Hot Anchor’s pregnancy troubles
Hot Anchor’s pregnancy troubles
- Advertisement -

ఒకప్పుడు అందమైన యాంకర్.. మహాబాగుంటుందిలే అని కుర్రకారు బాగా మనసులు పారేసుకునేవారు ఉదయబాను మీద..! ఇప్పుడూ కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు  ఆమె అభిమాన సంఘంలో ఉన్నారులెండీ…! కాకపోతే వయసైపోతుంది.. అలానే కొత్త కొత్త యాంకర్స్ వస్తున్నారు.. కారణంగా చాలా మంది తగ్గిపోయారు.

ఉదయబాను యాంకరింగ్ చేస్తున్న కొత్తలో..  ఆవిణ్ణి ఎంతసేపైనా.. చూస్తూ ఉండాలనిపించేది, ఎందుకంటే.. హీరోయిన్లను తలపించేలా.. డ్రెస్ లు వేస్తూ.. రచ్చ చేసేది! ఇప్పుడలా డ్రెస్ వేసుకోవటం లేదా.. అంటే.. వేసుకుంటుందీ.. కాకపోతే అప్పుడున్నంత మెరుపు కనిపించటంలేదు. దానికారణంగా మొన్నటివరకు ఆమె అందాన్ని చూసి మైమరచిపోయిన జనం.. ఇప్పుడు అందం కాకుండా మాటల మీద దృష్టి పెడుతున్నారు! మరి.

అయితే కొంత కాలంగా టీవీలకు దూరమైన ఉదయభాను గురించి ఇప్పుడు ఒక వార్త హల్‌ చల్‌ చేస్తోంది.  క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఉద‌య‌భానుకు చాలా చిన్న వ‌య‌స్సులోనే ఓ వ్య‌క్తితోపెళ్ల‌య్యింది. అయితే ఆ ముస్లిం వ్య‌క్తితో జ‌రిగిన పెళ్లి ఆమెకు అస్స‌లు ఇష్టం లేదు. ఉద‌య‌భాను త‌ల్లి ఆమెను బ‌ల‌వంతంగా అత‌డికి ఇచ్చి ఆమె పెళ్లి చేసింది. అయితే కొద్ది రోజుల‌కే ఆమె త‌న మొద‌టి భ‌ర్త‌కు దూర‌మైంది. త‌ర్వాత ఆమె చదువు పై శ్రద్దపెట్టి టీవీ యాంకరింగ్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యింది.

త‌ర్వాత ఆమె యాంక‌ర్‌గా బుల్లితెర‌ను ఓ ఆటాడుకుంది. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో హాట్ హాట్ యాంక‌ర్‌గా బాగా స‌క్సెస్ అయ్యింది. త‌ర్వాత ఉద‌య‌భాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత టీవీ యాంకరింగ్ చేస్తూనే ఎంఏ పూర్తి చేసింది ఉదయభాను. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించింది.

కొన్ని సినిమాల్లో ఐటెం సాంగుల్లో ఆమె చిందులేసినా వెండితెర మీద ఆమెకు అనుకున్న గుర్తింపు రాలేదు. ప్ర‌స్తుతం ఆమె యాంకరింగ్‌తో పాటు, సినిమా ఛాన్స్ లు కూడా తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతోందని సమాచారం. పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత పిల్లలు కావాలని అనుకుందట. అందుకే ప్లాన్ చేసి మరి తల్లి కాబోతోందట ఉదయ భాను.

- Advertisement -