“గీతాంజలి” తర్వాత శ్రీనివాస్ రెడ్డి- “రాజు గారి గది” తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా”.
తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ… 2013 నేపథ్యంలో- కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సాగే సరదా కధే “జయమ్ము నిశ్చయమ్మురా”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత-దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు.
చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు మాట్లాడుతూ.. “కరీంనగర్, పోచంపల్లి, కాకినాడ, వైజాగ్, భీమిలి మొదలగు లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొందని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి, నిర్మాణం-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి !!