ప్రస్తుతం వరుస హిట్లతో బాక్సాఫీస్ బోనాంజాగా మారాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవల బన్నీ చేసిన మూడు చిత్రాలు వరుసగా ఘనవిజయాలు సాధించి కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీనికి తోడు అటు కేరళలోనూ అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ హీరోకి. దీంతో ఈ హీరో పెద్ద హీరోతో మల్టీస్టారర్ మూవీ చేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు అలాంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్, మెగాస్టార్ కాంబినేషన్ లో ఓ సినిమా కోసం తెరవెనక ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్-అంబరీష్ కలిసి నటించిన ‘దొడ్డ మానె హడ్డ’ మూవీ ఈ నెల 30న అక్కడ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో పునీత్, అంబరీష్ పోషించిన పాత్రలకు బన్నీ, చిరులకు సరిగ్గా సరిపోతారని టాక్. వీళ్లిద్దరిని దృష్టిలో పెట్టుకొనే ఇప్పటికే చాలా మంది తెలుగు నిర్మాతలు ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇక ఓ బడా నిర్మాత ఈ సినిమా హిట్టైతే.. రీమేక్ చేయడానికి రెడీగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అన్నీ కుదిరితే బన్నీతో చిరు చేయబోయే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=SEat90BBfBY.