చరిత్రలో ఈ రోజు : మార్చి 6..

229
On this day in history
- Advertisement -

మార్చి 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 65వ రోజు (లీపు సంవత్సరములో 66వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 300 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.

*జననాలు*

1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు. (మ.1564)
1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి. (మ.1949)
1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు.

1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు. (మ.1966)
1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
1936: కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి.

*మరణాలు*

1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)
1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)
2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (జ.1971)

- Advertisement -