చంద్రబాబుకు రిటైర్మెంటే:ఎకనామిక్‌ టైమ్స్‌

920
chandrababu
- Advertisement -

ఏపీ రాజకీయాలపై ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల తర్వాత చంద్రబాబు కథ ముగిసినట్లేనని..టీడీపీ చిత్తవడం ఖాయమని ఎకనామిక్ టైమ్స్‌ ప్రత్యేక వార్తను ప్రచురించింది. రాజకీయంగా తప్పు చేయడం చంద్రబాబు కొత్తకాదని 2019లో తప్పుడు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారనిఅభిప్రాయపడింది.

2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం చంద్రబాబు చేసిన తప్పైతే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల నాడీని అంచనావేయడంలో క్లారిటీ లేదన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనే అయనకు ప్రతిబంధకంగా మారిందన్నారు. క్యాస్ట్, కరప్షన్, క్రైమ్ ఈ మూడూ గత ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలోని ప్రధానమైన ఫీచర్లు అని పేర్కొంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితమైన బాబు 2014లో మోడీ,పవన్ మద్దతుతో గెలవగలిగారని పేర్కొంది. పవన్ విషయంలోనూ చంద్రబాబు వేసిన ఎత్తుగడ బూమ్ రాంగ్‌ అని తెలిపారు. పవన్‌ సొంతంగా పార్టీ పెట్టి పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని చంద్రబాబు భావించారని కానీ ఆ స్ట్రాటజీ రాంగ్ అని విశ్లేషించింది.

యాంటీ మోడీ వేవ్ బలంగా ఉందని బాబు అనుకోవడం కూడా భ్రమ అని, మోడీని, కేసీఆర్ ను తిడుతూ ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం బ్లండర్ మిస్టేక్ అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ చిత్తవడం ఖాయమని చంద్రబాబకు రిటైర్మెంటేనని ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

- Advertisement -