‘గ్యారేజ్’కు కాజల్ షాక్!

542
angered-kajal-left-janatha-garage-song-shoot
angered-kajal-left-janatha-garage-song-shoot
- Advertisement -

కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్..రిలీజ్ కు దగ్గరపడుతుండడం తో చిత్ర యూనిట్ అంత ఆ పనులలో ఉండగా స్పెషల్ సాంగ్ చేస్తున్న కాజల్ చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది.

అసలు కాజల్ కు ఇంత కోపం రావడానికి ఈ సాంగ్ లో వేసుకోమన్న ఓ డ్రెస్ కారణమని తెలుస్తోంది. గడిచిన మూడు రోజులుగా ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సాంగ్ లో డ్రెస్సెస్ విషయంలో కాజల్ కొన్ని కండీషన్స్ పెట్టిందట. సాంగ్ లో తెల్లటి డ్రెస్ వేసుకోనని ఆమె చెప్పినా చిత్ర యూనిట్ మళ్లీ అదే డ్రెస్ ఇవ్వడంతో ఆమె ఫైర్ అయిందని సమాచారం. అసలు డ్రెస్సే కారణమా లేక అంతర్గతంగా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. కాజల్ ఇలా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ కు కొరటాల శివకు ఏమీ పాలుపోవడం లేదట. మొత్తానికి చందమామ ‘జనతా గ్యారేజ్’ కు భలే షాక్ ఇచ్చింది.

కొంతమంది మాత్రం డ్రెస్ గురించి కాదు వేరే ఉందని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా కాజల్ ఇలా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ కు కొరటాల శివకు ఏమీ పాలుపోవడం లేదట.

- Advertisement -