కేసీఆర్‌ నేటి షెడ్యూల్‌…

644
- Advertisement -

తెలంగాణలో నేటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. నేడు పలువురు మంత్రులు కొత్త జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ఈ రోజు ఉదయం 11:12 గంటలకు పురుడు పోసుకోనున్నది.

ఉదయం 9:30 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బయలుదేరుతారు.
ఉదయం 10:30 గంటలకు సిద్దిపేటకు చేరుకుంటారు.
ఉదయం 11:12 గంటలకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం. సభలో ప్రసంగం.
మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట నుంచి బయలుదేరుతారు.
మధ్యాహ్నం 12.45 గంటలకు ములుగు మండలం మర్కూక్ మండల కార్యాలయం, పీహెచ్‌సీ ప్రారంభం, స్థానికులతో సమావేశం.
మధ్యాహ్నం 1.15 గంటలకు మర్కూక్‌కు నుంచి తిరుగు ప్రయాణం.

- Advertisement -