- Advertisement -
సర్కారు బడి అంటే చదువు సరిగా ఉండదని అందరికీ అపోహ ఉండటం సహజం. ఉపాధ్యాయులు సమయానికి రారు.. పాఠాలు చెప్పరు.. సౌకర్యాలు ఉండవు.. నాణ్యమైన బోధన ఉండదు.. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది.. అందుకే ప్రభుత్వ పాఠశాలలకు వద్దు.. అనే ఆపోహ ఉంది. ఇక సర్కారు బడుల్లోనే ఉత్తమ విధ్య అంటూ ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు సైతం తమ పిల్లల్ని ప్రైవేట్ బడుల్లోనే చదివిస్తున్నారు. అయితే ఓ మండల విధ్యాధికారి మాత్రం తన కూతురుని సర్కారు బడిలో చేర్పించి ఉపాధ్యాయులకు మార్గం చూపాడు.
వరంగల్ జిల్లా గీసుకొండ ఎంఈవో సుజన్‌తేజ తన కుమార్తెను మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి ఆరోపణలను పక్కన పెట్టడానికే ఎంఈవో సుజన్‌తేజ తన కూతురు నవ్యశ్రీని గీసుకొండ జెడ్పీపాఠశాలలో పదవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో మంగళవారం చేర్పించారు.
- Advertisement -