ఐటెం భామలతో కనక వర్షం..

327
kajal tamanna
kajal tamanna
- Advertisement -

ఎంటర్ టైన్ మెంట్ అంటే హాట్ హాట్ కంటెంట్ గా అర్ధం మారిపోయాక, టాప్ హీరోయిన్లు తమ వంతూ ఆ హాట్ నెస్ కి ఆజ్యం పోస్తూ గత కాలపు వాంప్స్ మాదిరిగా ఐటెం సాంగ్స్ తో రసిక ప్రేక్షకుల్ని రంజింప జేస్తున్నారు. బికినీ వేసినప్పుడు లేని బింకం ఐటెం అప్పుడు ఎందుకని, తలావొక కెవ్వు పాటెత్తుకుని ఆడి పాడేస్తున్నారు. 1960 లలోనే హిందీ హీరోయిన్ తొలిసారిగా బికినీ వేసిన కాలంలో, తెలుగు హీరోయిన్ ఇంకా వెనుకబడే చీరలో ఉండిపోయింది. అప్పుడా చీర తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు పొట్టి నిక్కరు దాకా వచ్చింది. అది కూడా చాలక బికినీ లతో ఒళ్ళు కప్పుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు బికినీల్లోనే చాలా కంఫర్ట్ ఫీలవుతోంది తెలుగు హీరోయిన్. ఇక ఐటెం సాంగ్స్ తో మేజువాణీ కూడా కానిచ్చేస్తూ, నేటి సినిమా హీరోయిన్ దేనికైనా తగును సుమా అన్పిస్తోంది.
ఇటీవల కాలం లో ఆడియన్స్ టెస్ట్ మారింది..ఇప్పటివరకు తెలుగు చిత్రాల ఐటెం సాంగ్స్ లలో ఫారిన్ మోడల్స్, లేదా బాలీవుడ్ మోడల్స్ ను చూసి..చూసి బోర్ కొట్టింది అనుకుంట..అందుకే మన హీరోయిన్స్ ల ఐటెం సాంగ్స్ లకు ఎక్కువ ఆదరిస్తున్నారు..వీరి ఆదరణను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు హీరోయిన్స్..
నిర్మాతలకి కమర్షియల్ హిట్ కావాలి. టాప్ హీరోయిన్లకి తక్షణ క్యాష్ కావాలి. ఈ రెండే ఐటెం సాంగ్స్ పుట్టుకకి కారణ మవుతున్నాయి. టాప్ స్టార్ పక్కన క్రేజీ హీరోయిన్ తో ఓ ఐటెం సాంగ్ పెడితే వాణిజ్య విలువలు బాగా పెరుగు తాయనే ఆశాభావం నిర్మాతలకీ, ఓ రెండ్రోజుల్లో ఇరవై నుంచీ 75 లక్షల వరకూ ఒక్క ఐటెం సాంగ్ తోనే గడించ వచ్చు కదా అన్న ఆశయం హీరోయిన్లకీ ఏర్పడి, ఇలా ఐటెం సాంగ్స్ పుడుతున్నాయి. ఇక ఈ సాంగ్స్ కోసం అట్టహాసంగా కోటి- కోటిన్నర రూపాయలతో వేసే భారీ సెట్టింగులు కళాదర్శకులకీ, కార్మికులకీ పుష్కలంగా ఆర్జన కూడా. ఇంకా కాస్ట్యూమర్లని కూడా మర్చి పోవద్దు.

kajal
స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఐటెం సాంగ్స్ చెయ్యడం కామన్ అయిపొయింది. తాజాగా ‘జనతా గ్యారేజ్’ లో పక్కా లోకల్ పాటతో ఓ ఊపు ఊపేసింది కాజల్. ఇప్పటిదాకా స్టార్ హీరోయిన్లు చేసిన ఐటెం సాంగ్స్ అన్నిటికంటే దీనికి ఎక్కువ పేరు వచ్చిందనడంలో డౌట్ లేదు. సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా ఈ పాటను చెబుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఈ పాట బాగా ఆకర్షిస్తోంది.
ఇదివరకు ఐటెం సాంగ్ అంటే అంత దూరం పోయే హీరోయిన్స్ , ఇప్పుడు ఐటెం సాంగ్ అనగానే ఎగిరి గత్తులేస్తున్నారు..ఐటెం సాంగ్ అనగానే తక్కువేం తీసుకోవడం లేదు..సినిమాకు ఎంత వసూళ్లు చేస్తున్నారో..ఐటెం కూడా అంతేకాకుండా సినిమా రేంజ్ లోనే తీసుకుంటున్నారు. ప్రేక్షక ఆదరణ ఎక్కువగా ఉండడం తో నిర్మాతలు సైతం వారు అడిగినదానికే మొగ్గు చూపిస్తున్నారు.
‘జనతా గ్యారేజ్’ సినిమాలో కాజల్ ఐటెం పాట చేసినందుకు 50 లక్షల వరకు తీసుకున్నట్టు సమాచారం. ‘జాగ్వార్’ అనే సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి 75 లక్షల తీసుకుందట. ఇక ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఐటెం సాంగ్ చేయడానికి కేథరిన్ త్రెసాకు కూడా బాగానే అడిగిందని వినికిడి. మొత్తానికి మన భామలంతా ఐటెం బాట పట్టి బాగానే సంపాదిస్తున్నారు.

- Advertisement -