కాళ్లతోనే కోట్లు సంపాదిస్తున్నా..!

214
priyanka chopra
priyanka chopra
- Advertisement -

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లో సైతం దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఇపుడు ఆమె పేరే ఓ బ్రాండ్‌గా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటు హాలీవుడ్.. ఇటు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ప్రియాంక చోప్రా.. యాడ్స్‌లలోనూ దూసుకుపోతుంది. పలు అంతర్జాతీయ సినీ వేదికల మీద కనిపించే ఈ బ్యూటి, సౌందర్యోపకరణాలు, బ్రాండెడ్ దుస్తులు, చెప్పులు, నెయిల్ పాలిష్లు ఇలా సుమారు 13 ప్రాడక్ట్స్‌కి అంబాసిడర్గా వ్యవహరిస్తోంది.

Priyanka-Chopra-Hot-Photos-01

తాజాగా పీసీ డబ్ల్యూ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాళ్లకు సంబందించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. టీనేజ్‌లో నా అవతారం మగరాయుడిలా ఉండేది. నా కాళ్లు అసలు నాకు నచ్చేవి కాదు. అసలు అమ్మాయి కాళ్లలాగే ఉండేవి కాదంటూ విమర్శించేవారు. దాంతో అందంపై దృష్టిపెట్టాలనుకున్నాను. చేసి చూపించాను. ఇప్పుడు ఆ కాళ్లే ఓ 13 ప్రముఖ ఉత్పత్తుల్ని మార్కెట్‌లో ప్రచారం చేయడానికి పనికొస్తున్నాయని.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయని తెలిపింది. అయితే అప్పట్లో శరీరాన్ని సుకుమారంగా చూసుకోవటం ఎంత అవసరమో తెలిసేది కాదని, కానీ ఇప్పుడు శరీరం విలువ తెలిసిందని చెప్పింది.

- Advertisement -