కాజల్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

317
Kajal opens up about marriage rumors
Kajal opens up about marriage rumors
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అందాల కలువ కళ్ల సుందరి కాజల్ అతి తక్కువ కాలంలో అగ్రహీరోలతో చాన్స్ కొట్టి నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు రాంచరణర్, బన్ని, పవన్ కళ్యాన్ లతో నటించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెం.150 చిత్రంలో నటిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన కాజల్ బాలీవుడ్ లో ఎక్కువ పేరు సంపాదించలేక పోయింది.

Kajal opens up about marriage rumors

కాస్త వయసొచ్చిన హీరోయిన్స్ కి సంబందించిన గాసిప్స్ లో పెళ్లి ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ఇక 28 – 30 ఏళ్లు దాటితే కచ్చితంగా ఆ విషయంపై అప్పటికే ఎవరితోనో డేటింగ్ లో ఉందనో లేక పెళ్లికి రెడీ అనో అదీ కాకపోతే పెళ్లి సంబందాలు చూస్తున్నారనో రకరకాల గాసిప్పులు ఫుంకాను ఫుంకాలుగా వచ్చిపడుతుంటాయి. అయితే ఇదే లిస్ట్ లో ఇప్పటికే చేరిన కాజల్.. తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ కు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే.. తన పెళ్లి కి సంబందించిన కీలక విషయాన్ని చెప్పింది.

Kajal opens up about marriage rumors

ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లబుచ్చింది. తాను త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు..తగిన వ్యక్తి కోసం చూస్తున్నానని, నేననుకున్న లక్షణాలున్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కాజల్. అయితే ఇదంతా మరో రెండు సంవత్సరాల తర్వాతట. మరో రెండేళ్లు తనని వదిలేయమనీ ఆ తరువాతే పెళ్ళి చేసుకుంటాననీ ఇప్పటికే తల్లిదండ్రులకి తేల్చి చెప్పేసిందట! అదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది కాజల్!

Kajal opens up about marriage rumors

పెళ్లి తర్వాత తన చెల్లెలు కూడా మంచి లైఫ్ గడుపుతుందని పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లు తమ కుటుంబాన్ని గురించే ఆలోచిస్తారని నేనూ కూడా అలాంటి బాటలోనే నడవాలనుకుంటున్నా అని తెలిపింది.

Kajal opens up about marriage rumors

అత్తారింటి బాధ్యతలు, భర్తతో సమయం గడపడం, వ్యక్తి జీవితానికే తొలి ప్రాధాన్యాన్ని ఇస్తానని స్పష్టం చేసింది. కాబట్టి పెళ్లైతే సినిమా ఊసే అయితే ఉండదని తేల్చేసింది. ఈ లెక్కన చూసుకుంటె.. కాజల్ మరో రెండేళ్ల తర్వాత “శ్రీమతి కాజల్” అయిపోతుందన్నమాట. ఆ విషయంలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం తన పెళ్ళి వార్తల ఊహాగానాలను నిలిపివేయమంటూ పరోక్షంగా హెచ్చరిక చేసిందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

- Advertisement -