హస్తం గుర్తును సూచించేలా ఐదు అంశాలకె పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. విద్య,వైద్యం,ఉద్యోగ కల్పన,రైతులు,పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్.
మేనిఫెస్టో హైలెట్స్..
()ఉపాధిహామీ పథకం 100 రోజుల నుండి 150 రోజులకు విస్తరణ
() ఇకపై రైతులు లోన్లు కట్టకుంటే క్రిమినల్ కేసులు ఉండవు
()ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగుపరుస్తాం
()దేశంలోని 20 శాతం పేదలకు ఏడాదికి 72 వేల సాయం
()ఉద్యోగాల భర్తీ,దేశంలో 22 లక్షల ఖాళీలుఉన్నాయి
()విద్యారంగానికి బడ్జెట్లో 6 శాతం నిధులు
()అందరికి సామాజిక న్యాయం
() యువకులు వ్యాపారం చేయాలనుకుంటే మూడేళ్లపాటు ఎలాంటి షరతులు అవసరం లేదు
గత ఐదేళ్లలో మోడీ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు రాహుల్. దేశాన్ని ఒక్కటి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. దేశంలో ప్రస్తుతం ఎకనామిక్ ఎమర్జెన్సీ ఉందన్నారు. చౌకీదార్‌గా చెప్పుకుంటున్నా మోడీ అన్నిరంగాల్లో విఫలమయ్యారని మండిపడ్డారు.
2030 నాటికి దేశంలో పేదరికాన్ని నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు.