కమలంతో ‘నారా’ ప్రయాణం

276
- Advertisement -

ఎంతో కాలంగా ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై రెండున్నరేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతుండగా, తాజాగా ఢిల్లీలో బీజేపీ, టీడీపీ నేతలు హైడ్రామా నడిపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబోతున్నారంటూ ఉదయం నుంచి రాత్రి వరకు నానా హడావిడి చేశారు. టీడీపీ మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంతనాలు జరపడం, మధ్య మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ…. ఏ క్షణంలోనైనా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం ఉందన్న రీతిలో హైడ్రామా నడిపించారు.

babu venkaiah

కానీ సీన్ కట్ చేస్తే ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అధికార టీడీపీ,బీజేపీ డిఫెన్స్‌లో పడింది. బీజేపీ..ప్రజల చెవిలో పెద్ద క్యాబేజ్ పెట్టిందని జగన్ మండిపడితే….జనసేన అధినేత పవన్ ఏపీకి రెండు పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న ప్యాకేజే సరైంది అంటూ టీడీపీ అండ్ కో భావిస్తుండటంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రజలందరు స్వచ్చందంగా బంద్ లో పాల్గొంటున్నారు.

tdp-bjp

ఇంటర్నెట్ ను ఆయుధంగా చేసుకుని కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా మార్గాలను బలంగా వాడుకున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకున్నాయి. సరిగ్గా ఇదే రీతిన వివిధ సంస్థలు, వ్యక్తులు ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

tdp

రకరకాల సెటైర్లతో తమ వాదనను వినిపిస్తున్నారు. సూపర్ బ్యాడ్ ఫిల్మ్స్ పతాకంపై సుజనా చౌదరి సమర్పించు కమలంతో నారా ప్రయాణం అన్నది దీనికి టైటిల్. ఇలా రకరకాల క్యాప్షన్స్ ఇచ్చేయడం నెటిజన్స్ వంతైంది. ఈ చిత్రానికి నిర్మాత అరుణ్ జైట్లీ అని, డైరెక్టర్ వెంకయ్యనాయుడు అంటూ వాళ్ళకీ హోదా లిచ్చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. నవ్వుల్లో ముంచెత్తేలా నెటిజన్లు భలే స్పందిస్తున్నారు.

chandrababu

ముఖ్యంగా ఏపీకి ఐదేళ్లు కాదు. పదేళ్లు హోదా కావాలంటూ సాక్షాత్తూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసే మాటలు, ఈనాడు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆనాడు సభలో ప్రధాని ఇచ్చిన మాటకే విలువలేనప్పుడు, ఇప్పుడు ప్యాకేజీ అంటూ మంత్రులు చేయనున్న ప్రకటనలకు విలువ వుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. హోదాతో సమానంగా ప్యాకేజ్ ఇస్తామంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టే గారడి తప్ప మరేమికాదని దుమ్మెత్తిపోస్తున్నారు.

తనను హైటెక్ చీఫ్ మినిస్టర్‌గా చెప్పుకునే చంద్రబాబు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహాం చూసి ఖంగుతింటున్నారు. మొత్తంగా హైటెక్ బాబుపై నెటిజన్లు తమదైన శైలీలో మండిపడుతుండటం..కామెడీ ఫోటోలతో వేస్తున్న సెటైర్లు వైరలయ్యాయి.

babu

- Advertisement -