జేబుగులా… ఓలా ఎక్కండి

626
OLA car cab
OLA car cab
- Advertisement -

ఓలా క్యాబ్లొ జర్ని చెసిన ప్యాసింజర్లకు చుక్కలు చూపిస్తున్నారు ఓలా సిబ్బంది. గుండె దడ వచ్చేలా బిల్లులు వడ్డిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన తర్వాతగానీ వాటిని సరిచేసి క్షమాపణలు చెప్పి చేతులు దులిపేసుకునే పరిస్థితి కనిపించడంలేదు. సందీప్ అనే వ్య‌క్తి నిన్న ఉద‌యం వ‌న‌స్థ‌లిపురం నుండి హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌ స్పేస్‌కు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గ‌మ్యం చేరుకున్న త‌రువాత రూ.3566 బిల్లు చూసి షాక్ అయ్యాడు. ఆ తరువాత వ‌న‌స్థ‌లిపురం నుండి హైటెక్ సిటీకి అత్యంత చీప్ రేట్ ఇదే అని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు. ఇది ఈయ‌న ఒక్క‌ని అనుభ‌వ‌మే కాదు.

ప్ర‌త్యూష అనే ఐటీ ఉద్యోగి మెహిదీప‌ట్నం నుండి గ‌చ్చిబౌళికి క్యాబ్ బుక్ చేసుకోగా.. ఛార్జి రూ.730 అని మెసేజ్ రావ‌డంతో క్యాబ్ ర‌ద్దు చేసుకుంది. సాధార‌ణంగా దీని ధ‌ర రూ.160. రోహిత్ అక్ష‌య్ అనే అత‌ను సికింద్రాబాద్ రైల్ నిల‌యం నుండి నాన‌క్ రామ్ గూడ‌కు రూ.1518 చెల్లించాల్సి వ‌చ్చింది. నిజానికి ఈ మ‌ధ్య దూరానికి రూ.387 అవుతుంది.

ola cabs

ఈ నెల 4న హైదరాబాద్ నుంచి నిజమాబాద్కు వెళ్లిన రతీశ్ శేఖర్ అనే వ్యక్తికి ఓలా క్యాబ్ రూ.9.15లక్షల బిల్లుతో షాకిచ్చింది. ఆయన ప్రయాణించిన కారు 450 కిలోమీటర్లు ఉండగా మీటర్ రీడింగ్ మాత్రం ఏకంగా 85,427కి.మీ అని చూపించింది. చాలా సేపు క్యాబ్ స్టాఫ్ తో గొడవ పడగా రూ.4,812 రూపాయలు చెల్లించాలని సూచించారు. ఆ డబ్బులు చెల్లించి రతీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై హెడాఫీసులో నిలదీయగా కంప్యూటర్ ఎర్రర్ గా చెప్పుకొచ్చారు.

ఇదే తరహాలోనే మహారాష్ట్రలో కమల్ బాటియా అనే వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ వివాహ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి ముంబయి నుంచి పుణెకు వెళ్లిన ఆయనకు మొత్తం రూ.83,395 బిల్లు చూపించింది. గంటకు 500 కిమీ వేగంతో 14 గంటల్లో 7 వేల కిలో మీటర్లు ప్రయాణించినట్లుగా ఇన్వాయిస్లో వచ్చింది. ఈ బిల్లు చూసిన తొలుత షాకైన బాటియా.. ఆ వెంటనే తేరుకుని డ్రైవర్తో కాసేపు వాదులాడే ప్రయత్నం చేశాడు. అయితే, అది సాఫ్ట్ వేర్ సమస్య అని గుర్తించిన డ్రైవర్ కాల్ సెంటర్కు ఫోన్ చేసి బిల్లు సవరించడంతో బాటియా మొత్తం 347 కిలో మీట్లరకు రూ.4,088 చెల్లించాడు.

ఇలాంటి ఘటనలు ఓలా క్యాబ్లో ఎక్కువగా చోటు చేసుకునే ఉంటున్నాయి. ఈ క్యాబ్ స‌ర్వీసులు అడ్డ‌గోలుగా ఛార్జీలు వ‌సూలు చేసి ప్ర‌యాణికుల‌ను దోచుకున్నాయ‌ని, ప్ర‌భుత్వం ఈ క్యాబ్ ల  ధ‌ర‌ల‌ను నియంత్రించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

- Advertisement -