ఒక్క సీన్‌ కోసం కష్టపడుతున్న ప్రభాస్‌

260
prabhas Bahubali
- Advertisement -

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..?. బాహుబలి మొదటి పార్టు చూసిన ప్రతీ అభిమాని ప్రశ్న ఇది. దీనికి సమాధానం తెలియాలంటే బాహుబలి 2ను చూడాల్సిందేనని దర్శక ధీరుడు రాజమౌళీ ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. ఇక మొదటి పార్టుకు ఊహించని రెస్పాన్స్‌ రావడంతో.. సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలను చేరుకోవడానికి జక్కన్న టీమ్ పగలు రాత్రి కష్టపడుతుంది. అయితే ఈ సినిమా హీరో బాహుబలి.. ప్రభాస్ మాత్రం అంతకంటే ఎక్కువగానే కష్టపడుతున్నట్టు టాక్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిందని సమాచారం. ఇక క్లైమాక్స్‌ సీన్స్‌ షూటింగ్ జరగాల్సి ఉంది. ఈ క్లైమాక్సే ఈ సినిమాకు హైలైట్ అవుతుందట.

encriptthumb

ఈ సినిమాలో ఒక్కో సీన్ చేసేందుకు రాజమౌళి గైడెన్స్ లో ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. ఈ సీన్ షూటింగ్ కు కూడా చాలా రోజులు పడుతోంది. ఇంత ప్రాధాన్యం కలిగిన సీన్ లో యాక్ట్ చేసేందుకు ప్రభాస్ చాలా కేర్ తీసుకుంటున్నాడు.

Baahubali New HD Working Stills,SS Rajamouli,Prabhas,Rana Daggubati (1)

క్లైమాక్స్ సీన్ కోసం ప్రభాస్ ఎంత కేర్ తీసుకుంటున్నాడంటే … నెల రోజులుగా దీనికోసం కష్టపడుతున్నాడట. ఇప్పటికి ట్రైనింగ్ పూర్తయిందని, ఇక సీన్ షూటింగ్ కు అటెండ్ అవుతాడని అంటున్నారు. ఏ హీరో అయినా ఫలానా సినిమాలో తన కేరక్టర్ గురించి ఆలోచించడం మామూలే. కానీ ఒక్క సీన్ గురించి నెలరోజులపాటు ట్రైనింగ్ తీసుకోవడమనేది ఈ రోజుల్లో చాలా అరుదైన సంగతి. ప్రభాస్ అంత కష్టపడుతున్నాడంటే అతను ఎంత శ్రద్ధ తీసుకుంటున్నదీ తెలుస్తోంది. చకచకా సాగిపోతున్న షూటింగ్‌ మరో రెండు నెలల్లో నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తికానుందని సమాచారం.

మొదటి పార్టు తరహాలోనే రెండో పార్టులోనూ కండలతో కనిపించేందుకు ప్రభాస్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్‌-రాణా తమ స్ట్రాంగ్‌ ఫిజిక్‌ను మెయింటెన్‌ చేసేందుకు రోజుకు 40 ఎగ్‌వైట్‌లను తింటున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇక ’బాహుబలి’ ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్ 23న ట్రైలర్ వి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -